తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్వేల్లో అనూహ్యంగా దూసుకొచ్చింది కేకే సర్వే. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత అతను ఓ ట్రెండ్.. ఎవరూ ఊహించని విధంగా అతను చెప్పినట్లే వైసీపీ సీట్లు రావటం అనేది సంచలనంగా మారింది. ఆ తర్వాత నుంచి కేకే సర్వేపై అంచనాలు భారీగా పెరిగాయి. హర్యానా ఫలితాలు భిన్నంగా వచ్చినా.. మహారాష్ట్రలో మాత్రం అతని ఎగ్జిట్ పోల్ సర్వే నిజం అయ్యింది.
ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేకే ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా వచ్చాయి. రివర్స్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్ లో ఆప్ పార్టీ 44 సీట్లు.. బీజేపీ 26 సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పగా.. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి. బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 సీట్లలో గెలుపొందింది. కేకే ఎగ్జిట్ పోల్ సర్వేకు క్వయిట్ ఆపోజిట్ లో ఎన్నికల ఫలితాలు రావటం విశేషం.
ALSO READ | కేకే సర్వే : ఢిల్లీలో గెలిచేది ఆప్ పార్టీనే
ఏడాది కాలంలో కేకే సర్వే ఫలితాలు రెండు రాష్ట్రాల్లో ఆయన చెప్పినట్లు జరిగితే.. మరో రెండు రాష్ట్రాల్లో మాత్రం రివర్స్ అయ్యాయి. ఏపీ, మహారాష్ట్ర ఫలితాలు కేకే సర్వే నిజం అయితే.. హర్యానా, ఢిల్లీలో మాత్రం తప్పయ్యాయి. మొత్తానికి ఢిల్లీ ఫలితాలు మాత్రం కేకే సర్వేకు వ్యతిరేకంగా రావటం చర్చనీయాంశం అయ్యింది. కేకే సర్వే 50 శాతం మాత్రమే నిజం.. బొమ్మా బొరుసా అన్నట్లు ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.