టీమిండియా అరంగేట్రం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన సర్ఫరాజ్ ఖాన్..తన తొలి టెస్టులోనే సత్తా చాటి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంగ్లాండ్ పై రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్ మ్యాచ్ లో సర్ఫరాజ్ దూకుడు చూసి ఇప్పుడు అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నారు.
2023 ఐపీఎల్ మినీ వేలంలో 20 లక్షల కనీస ధరకు సర్ఫరాజ్ అమ్ముడుపోలేదు. అయితే నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈ 27 ఏళ్ళ బ్యాటర్ ను కొనేందుకు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్,రాయల్ ఛాలెంజర్స్ సర్ఫరాజ్ ను దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే రింకూ సింగ్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసే ప్రయత్నంలో సర్ఫరాజ్ ను కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీ అధికారులకు సూచించాడట
సర్ఫరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలో ఉందని.. ధోనీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సర్ఫరాజ్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2015, 18 మధ్యలో మూడు ఐపీఎల్ సీజన్ లలో ఆర్సీబీ తరపున ఆడాడు. అయితే డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లితో కూడిన జట్టులో ప్లేయింగ్ 11 లో ఎక్కవ అవకాశాలు పొందడంలో విఫలమయ్యాడు.
సర్ఫరాజ్ 2015, 2023 మధ్య 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 585 పరుగులు చేశాడు. చివరిసారిగా 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున.. 2019, 2021 మధ్య పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
As per reports, Sarfaraz Khan to get an IPL team ahead of 2024 season.
— SportsTiger (@The_SportsTiger) February 21, 2024
📷: BCCI#sarfarazkhan #ipl #ipl2024 #newsupdate #cricketnews pic.twitter.com/gh62sigcHM