MI vs KKR: పీకల్లోతూ కష్టాల్లో KKR.. ముంబై బౌలర్ల ధాటికి కుప్పకూలిన టాపార్డర్

MI vs KKR: పీకల్లోతూ కష్టాల్లో  KKR.. ముంబై బౌలర్ల ధాటికి కుప్పకూలిన టాపార్డర్

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచులో కోల్‎కత్తా పీకల్లోతూ కష్టాల్లో పడింది. సొంతగడ్డపై ముంబై బౌలర్లు విజృంభించడంతో కేకేఆర్ టాపార్డర్ కుప్పకూలింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్‎కు క్యూ కట్టారు. లాస్ట్ మ్యాచులో భారీ ఇన్సింగ్స్‎తో ఆకట్టుకున్న ఓపెనర్ క్వింటన్ డికాక్ ముంబైపై విఫలమయ్యాడు. 

కేవలం 1 రన్ మాత్రమే చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో అశ్వినీ కుమార్‎కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండా డకౌట్ అయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే (11), ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ (3) చేతులేత్తేశారు. ఈ దశలో యంగ్ బ్యాటర్స్ అంగ్‏క్రిష్ రఘువంశీ, రింకు సింగ్ కాసేపు వికెట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. 

ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రఘువంశీ (26).. వేగంగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం  కోల్‎కతా 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. రింకు సింగ్ (17), మనీష్ పాండే (15) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. కేకేఆర్ ఆశలన్నీ ఈ ఇద్దరిపైనే ఉన్నాయి. ముంబై బౌలర్లో బౌల్ట్ ఒక వికెట్ తీయగా.. దీపక్ చాహర్, అశ్వినీ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.