రఫ్ఫాడించిన రహానే.. IPL సీజన్18లో తొలి హాఫ్​సెంచరీ నమోదు

రఫ్ఫాడించిన రహానే.. IPL సీజన్18లో తొలి హాఫ్​సెంచరీ నమోదు


టెస్ట్ ప్లేయర్ అని ముద్ర వేశారు.. వేలంలోనూ ఏ ఫ్రాంచైజ్ కొనగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కనీస ధర రూ.1.5 కోట్లకు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‎కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా అతడిపై నమ్మకంతో జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. కేకేఆర్ యజమాన్యం తనపై పెట్టుకున్న నమ్ముకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే.

 ఐపీఎల్ 18 సీజన్ తొలి మ్యాచులోనే రహానే కెప్టెన్ ఇన్సింగ్స్‎తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు  చేశాడు రహానే. సిక్సులు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచు స్టార్టింగ్లోనే  వికెట్ పడ్డా ఏ మాత్రం బెరుకులేకుండా యధేచ్చగా బౌండరీలు బాదుతూ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

ఈ మ్యాచులో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు బాది 56 పరుగులు చేశాడు రహానే. ప్రస్తుతం కేకేఆర్ 11.2 ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ (5), రఘువంశీ (2) ఉన్నారు. రసిఖ్ దార్ సలామ్ 2 వికెట్లు తీయగా.. సయాష్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. రహానే, సునీల్ నరైన్ రాణించడంతో కేకేఆర్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

ALSO READ | KKR vs RCB: రూ.11 కోట్ల బౌలర్‌కు ఏమైంది.. భువనేశ్వర్ లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ