CSKvKKR: చెన్నై ఘోర ఓటమి.. 104 పరుగుల టార్గెట్ను.. KKR ఎన్ని ఓవర్లలో ముగించేసిందంటే..

CSKvKKR: చెన్నై ఘోర ఓటమి.. 104 పరుగుల టార్గెట్ను.. KKR ఎన్ని ఓవర్లలో ముగించేసిందంటే..

చెన్నై: కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో KKR ఘన విజయం సాధించింది. 10.1 ఓవర్లలో 104 పరుగుల లక్ష్యాన్ని KKR అలవోకగా దాటేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలో 107 పరుగులు చేసి చెన్నై జట్టును చిత్తు చేసింది.

కోల్ కత్తా జట్టుకు ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (23), సునీల్ నరైన్ (44) శుభారంభాన్ని అందించారు. డి కాక్ 16 బంతుల్లో 23 పరుగులు, సునీల్ నరైన్ 18 బంతుల్లో 5 సిక్సులు, 2 ఫోర్లతో 44 పరుగులు చేసి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత కేకేఆర్ కెప్టెన్ రహానే 20 పరుగులు, రింకూ సింగ్ 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి 10.1 ఓవర్లకే టార్గెట్ను ఫినిష్ చేశారు.

గౌతమ్ గంభీర్, నితీష్ రానా తర్వాత చెన్నై జట్టును చెపాక్ స్టేడియంలో ఓడించిన కేకేఆర్ కెప్టెన్గా రహానే నిలవడం విశేషం. 2025 ఐపీఎల్ సీజన్లో ఇప్పటిదాకా అత్యంత ఘోర పరాజయాన్ని  మూటగట్టుకున్న టీంగా చెన్నై అప్రతిష్టను మూటగట్టుకుంది. టాస్ గెలిచిన కోల్ కత్తా జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది.

చెన్నై బ్యాటర్లు కేకేఆర్ బౌలింగ్ దెబ్బకు కకావికలమయ్యారు. పరుగులు పిండుకోవడం అటుంచితే వికెట్ నిలుపుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. రచిన్ రవీంద్ర 4 పరుగులు, కాన్వే 12 పరుగులు, త్రిపాఠి 16 పరుగులు, విజయ్ శంకర్ 29, శివమ్ దూబే 31 (నాటౌట్), అశ్విన్ 1, జడేజా డకౌట్, దీపక్ హుడా డకౌట్, ధోనీ 1, నూర్ అహ్మద్ 1, అన్షుల్ కాంబోజ్ 3 పరుగులు.. ఇలా చెన్నై బ్యాటింగ్ అత్యంత పేలవంగా సాగింది.

చెన్నై అభిమానులు ఈ అపజయంతో తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. చెన్నై జట్టు ఈ ఓటమితో కలిపి మొత్తం 5 మ్యాచులు ఓడిపోయింది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ విజయంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలిచింది.