కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు రమణదీప్ సింగ్‌పై ఐపీఎల్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.
27 ఏళ్ల రమణదీప్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. అతను తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలపై చర్యలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైని బీసీసీఐ తెలిపింది.
Ramandeep Singh have committed a Level 1 offence under Article 2.20 of the IPL Code of Conduct.
— CricketGully (@thecricketgully) May 12, 2024
📸 IPL/BCCI pic.twitter.com/HocYtz0o52
ఏంటి లెవల్ 1 నేరం..?
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఇతర క్రికెట్ సామాగ్రిని ధ్వంసం చేయడమనేది లెవల్ 1 నేరం కిందకు వస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఉద్దేశపూర్వకంగా అయినా లేదా ప్రమాదవశాత్తూ అయినా వికెట్‌లను కొట్టడం/ తన్నడం, అడ్వర్టైజింగ్ బోర్డులు/ సరిహద్దు కంచెలు/ డ్రెస్సింగ్ రూమ్ తలుపులు, అద్దాలు, కిటికీలు వంటి వాటికి నష్టం కలిగించడం అన్నమాట.
ఈ మ్యాచ్‌లో రమణదీప్ అజేయంగా 17 పరుగులు చేశాడు.