ముంబై: వెస్టిండీస్ లెజెండ్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్‌పై ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారూక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నరైన్ కేకేఆర్ సూపర్‌మ్యాన్ అని కొనియాడాడు. టీమ్ విజయం వెనకున్న నిజమైన శక్తి అతనేనని అభిప్రాయపడ్డాడు. ‘మా ఇంట్లో నరైన్‌ను మేమంతా సూపర్‌మ్యాన్ అంటాం. మైదానంలో అతనే బాస్. ప్లేయర్‌గా, బౌలర్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా ఏ పాత్రలోనైనా అదరగొడతాడు. ఒక ప్లేయర్‌గా తను అన్నీ చేసేస్తాడు. నరైన్ ఉత్సాహవంతుడు, చాలా మంచోడు.
ఇండియన్స్ అయినా.. ఫారినర్స్ అయినా టీమ్ కోసం మనస్ఫూర్తిగా పని చేసే ఇలాంటి ఆటగాళ్లు ఉండటం మా అదృష్టం’ అని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో ఓ షోలో పేర్కొన్నాడు. నరైన్‌తో పాటు ఆండ్రీ రసెల్ కూడా కేకేఆర్‌కు చాలా కీలకమని అభిప్రాయపడ్డాడు. గాయాల కారణంగా వీళ్లలో ఒక్కరు లేకపోయినా జట్టుకు ఎదురుదెబ్బ తగులుతుందన్నాడు. చాలా ఏండ్లుగా కేకేఆర్‌కు ఆడుతున్న వీళ్లు తమ కుటుంబంలో భాగం అయ్యారని షారూక్ చెప్పాడు.