ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ స్లోగా ఉండటం, కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేస్తే 200 పైచిలుకు లక్ష్యాలు నిర్ధేశిస్తుండడంతో ఢిల్లీ సారథి.. బౌలింగ్ వైపు మొగ్గు చూపలేదు.
కోల్‌కతా గత మ్యాచ్‌లో పరాజయం పాలవ్వగా.. పంత్ సారథ్యంలోని ఢిల్లీ గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మంచి జోరు మీదుంది. ఇక ఇప్పటివరకూ ఈ ఇరు జట్ల జయాపజయాల గురించి పరిశీలిస్తే.. కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే.. ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు కీలకం. ఈ క్రమంలో ఉత్కంఠ పోరు తప్పకపోవచ్చు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలామ్.
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రానా, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.