KKR vs DC: రైడర్స్ రేసులో నిలుస్తుందా! ఇవాళ (ఏప్రిల్ 29) ఢిల్లీతో కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

KKR vs DC: రైడర్స్ రేసులో నిలుస్తుందా! ఇవాళ (ఏప్రిల్ 29) ఢిల్లీతో కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–18లో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ అయ్యింది. మంగళవారం (ఏప్రిల్ 29)  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమీతుమీ తేల్చుకోనుంది. గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు పరాజయాలను చవిచూసిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంచుకుంది. దీంతో ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. 

లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో బలమైన జట్టుగా ముద్రపడిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం అన్ని విభాగాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థిరత్వం లోపించింది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డికాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెహమనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. దీంతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహానె, అంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఘువంశీపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇది స్కోరు బోర్డుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. 

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 120 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ఆందోళన కలిగించే అంశం. డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లలో రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపాలంటే వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరోరా, హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా సమష్టిగా రాణించాల్సిన అవసరం చాలా ఉంది. మరోవైపు స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు కొద్దిగా తడబడుతోంది. గత నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టి టోర్నీ చివర్లో ఎలాంటి ఆటంకాలు  రాకుండా చూసుకోవాలని డీసీ భావిస్తోంది. 

టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూకుడుగా ఆడుతున్నా.. డు ప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటాడుతోంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీసీ తరఫున అత్యధిక రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తడబడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. కాబట్టి కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లు వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. . మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మెరవాల్సి ఉంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల్దీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువ భారం పడనుంది.