ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఈడెన్ పిచ్‌పై 161 పరుగులకే పరిమితమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(45; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్(39; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించారు. డి కాక్(10), హుడా(8), స్టోయినిస్(10) మరోసారి విఫలమయ్యారు.
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ తన సత్తా ఏంటో మరోసారి చూపెట్టాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, 25 కోట్ల బౌలర్ మిచెల్ స్టార్క్ 4 మ్యాచ్‌ల తరువాత గాడిలో పడ్డాడు. తన 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
Mitchell Starc's best performance of the season - KKR need 162 for victory at Eden Gardens #KKRvLSG #IPL2024
— ESPNcricinfo (@ESPNcricinfo) April 14, 2024
👉 https://t.co/ANv9OA7lJt pic.twitter.com/Lsi0SOrTYG
గత మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్లు
ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడిన ఆ మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మొదట కోల్‌కతా 208 పరుగులు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 204 పరుగులు చేసింది. భారీ స్కోర్లు నమోదయ్యే ఈడెన్ పిచ్‌పై లక్నో 161 పరుగులకు పరిమితమవ్వడమంటే.. తక్కువ స్కోరే.