ఈడెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన అనంతరం పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున 250 సిక్సర్లు బాదిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు, టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
ఒక జట్టు తరుపున అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లు
- విరాట్ కోహ్లీ(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 250 సిక్స్‌లు (245 మ్యాచ్‌లు)
- క్రిస్ గేల్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 239 సిక్స్‌లు (85 మ్యాచ్‌లు)
- ఏబీ డివిలియర్స్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 238 సిక్స్‌లు (156 మ్యాచ్‌లు)
- రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్): 224 సిక్స్‌లు (205 మ్యాచ్‌లు)
- కీరన్ పొలార్డ్(ముంబై ఇండియన్స్): 189 సిక్స్‌లు (223 మ్యాచ్‌లు)
ఐపీఎల్‌లో 250 సిక్సర్లు బాదిన నాలుగో బ్యాటర్, రెండో భారత ఆటగాడు.. కోహ్లీ. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో క్రిస్ గేల్ (357 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(275 సిక్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు.
- క్రిస్ గేల్ (KKR, RCB, PBKS): 357 సిక్స్‌లు (142 మ్యాచ్‌లు)
- రోహిత్ శర్మ(డెక్కన్ ఛార్జర్స్, MI): 275 సిక్స్‌లు (250 మ్యాచ్‌లు)
- డివిలియర్స్ (ఢిల్లీ క్యాపిటల్స్, RCB): 251 సిక్స్‌లు (184 మ్యాచ్‌లు)
- విరాట్ కోహ్లీ (RCB): 250 సిక్స్‌లు (245 మ్యాచ్‌లు)
- ఎంఎస్ ధోని(CSK, RPSG): 247 సిక్స్‌లు (257 మ్యాచ్‌లు)
అంతేకాదు, టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితాలో క్రిస్ గేల్‌ను కూడా అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు కోహ్లీ. టీ20 క్రికెట్‌లో ఒక జట్టు తరఫున 263 సిక్సర్లతో గేల్ రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ లీగ్‌తో సహా అన్ని టోర్నమెంట్‌లలో RCB తరపున ఆడుతున్నప్పుడు గేల్ ఈ ఫీట్ సాధించాడు.
- విరాట్ కోహ్లీ(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 264 సిక్స్‌లు (260 మ్యాచ్‌లు)
- క్రిస్ గేల్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 263 సిక్స్‌లు (91 మ్యాచ్‌లు)
- కీరన్ పొలార్డ్(ముంబై ఇండియన్స్): 258 సిక్స్‌లు (211 మ్యాచ్‌లు)
- ఎంఎస్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్): 243 సిక్స్‌లు (251 మ్యాచ్‌లు)
- రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్): 240 సిక్స్‌లు (214 మ్యాచ్‌లు)
- ఏబీ డివిలియర్స్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 240 సిక్స్‌లు (157 మ్యాచ్‌లు)