కోల్‌కతా నిర్ధేశించిన 224 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ధీటుగా బదులిస్తోంది. యశస్వి జైస్వాల్(19), సంజూ శాంసన్(12) త్వరగా ఔటైనా.. జోస్ బట్లర్(23 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), రియాన్ పరాగ్ (23 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)జోడి కోల్‌కతా బౌలర్లను ఎదుర్కొంటున్నారు. దేశవాళీ హీరోలు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా వంటి యువ బౌలర్లను టార్గెట్ చేసి వీరు పరుగులు రాబడుతున్నారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం రాయల్స్ స్కోర్.. 7 ఓవర్లు ముగిసేసరికి 85/2.
అంతకుముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. విండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 109 (56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీతో అదరగొట్టాడు. రఘువంశీ(30), రింకుసింగ్(20 నాటౌట్), రసెల్(13), శ్రేయస్(11), సాల్ట్(10), వెంకటేశ్(8), రమణ్‌దీప్(1 నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ 2, కుల్దీప్ సేన్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, యుజ్వేంద్ర చెరో వికెట్ పడగొట్టారు.
ALSO READ : ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Two wickets down but foot on the accelerator! 🔥 pic.twitter.com/0m8nJhSwlv
— Rajasthan Royals (@rajasthanroyals) April 16, 2024