సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోతున్నారు. సునీల్ నరైన్(51 నాటౌట్; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు), అంగ్‌క్రిష్ రఘువంశీ(30 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు) జోడి.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడికి పరుగులు రాబడుతున్నారు. సంజూ శాంసన్ ఎన్ని వ్యూహాలు అమలుచేసినా.. వికెట్ మాత్రం పడడం లేదు. బంతి ఎటుస్తే.. అటు బాదే వీరిని ఎలా పెవిలియన్ చేర్చాలో రాయల్స్ బౌలర్లకు అంతుచిక్కడం లేదు. వీరిద్దరి ధాటికి కోల్‌కతా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి ఓవర్ లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ట్రెంట్ బౌల్ట్ ఎంతో కట్టడిగా వేసిన ఆ ఓవర్ లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రియాన్ పరాగ్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ సాల్ట్(10).. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అవేశ్ ఖాన్ ఓవర్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్కడినుంచి సునీల్ నరైన్.. అంగ్‌క్రిష్ రఘువంశీ జోడి రాయల్స్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నారు. ఓవర్‌కు రెండు నుంచి మూడు చొప్పున బౌండరీలు సాధిస్తూ.. స్కోర్ బోర్డును నడిపిస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ సైతం ఈ జోడీని విడదీయ లేకపోతున్నారు. వీరి దూకుడు.. తరువాత వచ్చే బ్యాటర్ల లైనప్ చూస్తుంటే కోల్‌కతా.. రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యం నిర్ధేశించేలా కనిపిస్తోంది.
5️⃣0️⃣ up for Sunil Narine 💪
— IndianPremierLeague (@IPL) April 16, 2024
5️⃣0️⃣ partnership up for the 3rd wicket 💪
1️⃣0️⃣0️⃣ up for @KKRiders
Home side looking good at the halfway stage 👌👌
Follow the Match ▶️https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/w6r5jJrsnE