కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు బిగ్ షాక్ తగిలింది. మార్చి 23వ తేదీ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హర్షిత్ రాణా అత్యుత్సహన్ని ప్రదర్శించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ లను ఔట్ చేసిన అనంతరం వారిద్దరి వైపు కోపంతో చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులుఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్-1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చాడు. రెండు తప్పిదాలకు గానూ 10 శాతం, 50 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. మ్యాచ్ రిఫరీ విధించిన ఆంక్షలను పేసర్ అంగీకరించాడు. కాగా హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులకు 3 వికెట్లను పడగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 రన్స్ స్వల్ప తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (29 బాల్స్‌లో 8 సిక్స్‌లతో 63) దుమ్మురేపినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్‌లో 13 రన్స్ కావాల్సిన దశలో తొలి బాల్‌ను సిక్స్‌గా మలిచిన క్లాసెన్, షాహబాజ్ అహ్మద్ (16) మూడు బాల్స్ తేడాలో ఔట్ కావడం, లాస్ట్ బాల్‌కు 5 రన్స్ చేయలేకపోవడంతో హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూసింది.