ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‍రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సారథి పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ హైస్కోరింగ్ వెన్యూ కావడంతో మొదట భారీ స్కోర్లు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం తమ వ్యూహమని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్-2లో మళ్లీ ఆడుతుంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 26 సార్లు తలపడగా.. కేకేఆర్ 17, సన్ రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ఈ సీజన్‌లో ఒకసారి తలపడగా.. అందులో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.
తుది జట్లు
కోల్‌కతా: సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్((కెప్టెన్)), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.