కేకేఆర్​ టాప్​ షో ..98 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నోపై గెలుపు

కేకేఆర్​ టాప్​ షో ..98 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నోపై గెలుపు
  • దంచికొట్టిన సునీల్​ నరైన్​ 
  • రాణించిన చక్రవర్తి, హర్షిత్‌‌‌‌‌‌‌‌

లక్నో: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేరింది. సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 81), ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (14 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 32)  మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 98 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌జెయింట్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన కోల్‌‌‌‌‌‌‌‌కతా 20 ఓవర్లలో 235/6 స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్‌‌‌‌‌‌‌‌   3 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో లక్నో 16.1 ఓవర్లలో 137 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 36), రాహుల్‌‌‌‌‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 25) మాత్రమే పోరాడారు.  నరైన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

నరైన్‌‌‌‌‌‌‌‌ మళ్లీ దంచిండు..

ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌పై పంజాబ్‌‌‌‌‌‌‌‌ బౌలర్లను కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లు సాల్ట్‌‌‌‌‌‌‌‌, నరైన్‌‌‌‌‌‌‌‌ ఓ ఆటాడుకున్నారు. రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన సాల్ట్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరందుకుంటే.. అవతలి వైపు నరైన్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాడు. రెండు ఫోర్లతో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అతను 4వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌తో 20 రన్స్‌‌‌‌‌‌‌‌ దంచాడు. కానీ ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి సాల్ట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 61రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది.  

రఘువంశీ (32)   మెల్లగా ఆడినా ఊపు తగ్గించని నరైన్‌‌‌‌‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో 27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ దాటాడు. రఘువంశీ కూడా బౌండ్రీలు బాదడంతో సగం ఓవర్లకు కోల్‌‌‌‌‌‌‌‌కతా 110/1 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు, తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన నరైన్‌‌‌‌‌‌‌‌ను ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ (1/33) ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 

రసెల్‌‌‌‌‌‌‌‌ (12) సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోష్‌‌‌‌‌‌‌‌లో కనిపించినా పంజాబ్‌‌‌‌‌‌‌‌ పుంజుకున్నారు. వరుస ఓవర్లలో రసెల్‌‌‌‌‌‌‌‌, రఘువంశీని పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు చేర్చి కేకేఆర్‌‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిట్టర్‌‌‌‌‌‌‌‌ రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ (16) మరోసారి ఫెయిల్‌‌‌‌‌‌‌‌కాగా, చివర్లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (23) రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. రింకూతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 29, రమణ్​దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (25 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు24 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి వెనుదిరిగాడు. చివరి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ను రమణ్ దీప్‌‌‌‌‌‌‌‌ 4, 6గా మల్చడంతో కోల్‌‌‌‌‌‌‌‌కతా భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించింది. 

పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో లక్నోకు ఏదీ కలిసి రాలేదు. కోల్‌‌‌‌‌‌‌‌కతా బౌలర్ల సమన్వయం ముందు బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే అర్షిన్‌‌‌‌‌‌‌‌ కులకర్ణి (9) వికెట్‌‌‌‌‌‌‌‌ కోల్పోగా.. రాహుల్‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 55/1 స్కోరు చేసింది. కానీ 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా తడబడింది. 

రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించిన రాహుల్‌‌‌‌‌‌‌‌ను హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా (3/24) ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌ షాట్లు కొట్టినా, రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో వరుస ఓవర్లలో వికెట్లు పడ్డాయి. 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా (5) ఔట్‌‌‌‌‌‌‌‌కాగా, రసెల్‌‌‌‌‌‌‌‌ (2/17) తన వరుస ఓవర్లలో స్టోయినిస్‌‌‌‌‌‌‌‌, ని పూరన్‌‌‌‌‌‌‌‌ (10) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు.  ఇక్కడి నుంచి కేకేఆర్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు మరింత పట్టు బిగించారు. 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో బదోనీ (15), ఆ వెంటనే వరుసగా టర్నర్‌‌‌‌‌‌‌‌ (16), క్రునాల్‌‌‌‌‌‌‌‌ (5), యుధ్‌‌‌‌వీర్ (7), బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ (2) ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో లక్నో పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. స్పిన్నర్ వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు. 

సంక్షిప్త స్కోర్లు


కోల్‌‌‌‌‌‌‌‌కతా: 20 ఓవర్లలో 235/6 (నరైన్‌‌‌‌‌‌‌‌ 81, సాల్ట్‌‌‌‌‌‌‌‌ 32, నవీన్‌‌‌‌‌‌‌‌ 3/49). 

లక్నో: 16.1 ఓవర్లలో 137 ఆలౌట్​ (స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ 36, రాహుల్‌‌‌‌‌‌‌‌ 25, హర్షిత్ రాణా 3/24).