
కోల్కత్తా: ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారుతుందనే కంగారులో ఉన్న అభిమానులకు శుభవార్త. కోల్ కత్తాలో వాతావరణం పొడిగానే ఉంది. వాన పోయి ఎండ కూడా వచ్చింది. వర్షం పడే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ ప్రకారం కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య రాత్రి 7 గంటలకు టాస్, 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది.
ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ దగ్గర శనివారం ఉదయం కూడా నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుని, చిరు జల్లులు కురవడంతో ఐపీఎల్ అభిమానులు మ్యాచ్ జరుగుతుందో, లేదో అని టెన్షన్ పడ్డారు. కానీ.. మధ్యాహ్నం 12 తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాన కళ పోయి ఎండ రావడంతో కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.
🌞 The sun is shining bright in Kolkata, and the stage is set at Eden Gardens! 🏟️🔥
— Indian Cricket Team (@incricketteam) March 22, 2025
It's time for a high-voltage clash between 𝗞𝗞𝗥 ⚔️ 𝗥𝗖𝗕! 💜❤️ #KKRvsRCB #IPL2025 pic.twitter.com/pbeXliHwwP
ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, బెంగళూరుతో లీగ్‌కు తెరలేవనుంది. 17 ఏళ్ల కిందట తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బ్రెండన్ మెకల్లమ్ 158 రన్స్‌తో ఒక్కసారిగా టీ20లకు ఊపు తెచ్చాడు. అప్పట్నించి అదే వారసత్వాన్ని కొనసాగించిన కేకేఆర్ ఇప్పటికి మూడుసార్లు టైటిల్స్ నెగ్గింది. కొత్త కెప్టెన్ రహానే నాయకత్వంలోనూ దీన్ని కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌పై అందరి దృష్టి నెలకొంది.
ALSO READ : ఆదివారం ( మార్చి 23 ) ఉప్పల్ లో SRH మ్యాచ్.. భారీగా బ్లాక్ టికెట్లు స్వాధీనం
ఇక చాలా ఏళ్ల నుంచి టైటిల్‌కు అడుగు దూరంలో నిలుస్తున్న ఆర్‌సీబీ ఈసారి ఆ కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కోహ్లీ, సాల్ట్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మతో కూడిన బలమైన బ్యాటింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. కాకపోతే బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. భువనేశ్వర్, హాజిల్‌వుడ్‌పైనే ఎక్కువ భారం పడనుంది.