ఆస్ట్రేలియా ఏ తో జరగనున్న రెండో అనధికారిక టెస్టు కోసం భారత ఏ జట్టులో కేఎల్ రాహుల్ ను సెలక్ట్ చేశారు. పేలవ ఫామ్ కారణంగా రాహుల్ న్యూజిలాండ్ తో జరిగిన చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు రాహుల్ గాడిలో పడడానికి అతన్ని భారత జట్టులో ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. నవంబర్ 7 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా ఏ తో భారత్ ఏ తలపడనుంది. రాహుల్ తో పాటు ధ్రువ్ జురెల్‌లును కూడా భారత ఏ స్క్వాడ్ లో చేర్చబడ్డాడు.
బీసీసీఐ రాహుల్, జురెల్‌లను ఆస్ట్రేలియాకు త్వరగా పంపాలని నిర్ణయించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు వీరు సిద్ధంగా ఉండడం చాలా కీలకం. భారత్ ఏ తో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కావడంతో.. ఈ అనధికారిక టెస్టు ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. రెండవ అనధికారిక టెస్ట్ కు ఆస్ట్రేలియా ఏ స్కాట్ బోలాండ్, మైఖేల్ నేసర్ వంటి ఫాస్ట్ బౌలర్లు రానున్నారు. బలమైన ఆస్ట్రేలియన్ లైనప్‌ను ఎదుర్కొనేందుకు రాహుల్, జురెల్‌లు జట్టులో ఉండాలని బీసీసీఐ భావించింది.
ALSO READ : AUS vs PAK 2024: కోల్‌కతా వద్దనుకుంది.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించాడు
ఆస్ట్రేలియా–ఎ జట్టుతో తొలి అనధికార టెస్టులో ఇండియా–ఎ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియా ఇచ్చిన 225 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ మూడే వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. కెప్టెన్ నేథన్ మెక్‌స్వీనీ (88 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్ (61 నాటౌట్) జట్టును గెలిపించారు. ఓవర్‌నైట్ స్కోరు 139/3తో ఆసీస్ నాలుగో రోజు వికెట్ కోల్పోకుండా ఛేజింగ్ చేసింది.
Dhurv Jurel & KL Rahul pic.twitter.com/VCfLCuMHey
— RVCJ Media (@RVCJ_FB) November 4, 2024