కూతురి పేరు రివీల్ చేసిన రాహుల్, అతియా జోడీ.. నేమ్ ఎంత క్యూట్‎గా ఉందో..!

కూతురి పేరు రివీల్ చేసిన రాహుల్, అతియా జోడీ.. నేమ్ ఎంత క్యూట్‎గా ఉందో..!

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియో శెట్టి జోడి తమ కూతురి పేరును రివీల్ చేసింది. రాహుల్ బర్త్ డే (ఏప్రిల్ 18) రోజున తన కూతురి పేరును అతియో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పేరుతో పాటు దాని వెనక ఉన్న అర్థా్న్ని కూడా వివరించింది అతియా. తమ కూతురికి ‘ఎవారా విపుల రాహుల్’ అని నామకరణం చేశారు రాహుల్ జోడి.

‘ఎవారా’ అనేది సంస్కృత పదం. సంస్కృతంలో ఎవారా అంటే దేవుడిచ్చిన బహుమతి అని అర్థం. ‘విపుల’ అనే పేరు తన అమ్మమ్మ (నాని) గౌరవార్థం. పేరు చివరలోని రాహుల్ అనేది తన తండ్రి ఇంటి పేరు. కాగా.. 2025, మార్చి 24న రాహుల్, అతియా జోడి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అతియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  

లక్నో యాజమాన్యంతో విభేదాల కారణంగా కెప్టెన్సీ పగ్గాలతో పాటు ఆ జట్టును వదిలేసిన కేఎల్ రాహుల్‎ను మెగా వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భార్య డెలివరీ నేపథ్యంలో ఈ సీజన్ తొలి మ్యాచుకు దూరమైన రాహుల్ రెండో మ్యాచు నుంచి జట్టుతో కలిశాడు. ఢిల్లీ ఫ్రాంఛైజ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు రాహుల్. 

బెంగుళూరులోని చినస్వామి స్డేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడి ఢిల్లీ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ‘చినస్వామి స్టేడియం నా అడ్డ’ అంటూ రాహుల్ చేసుకున్న మ్యాచ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ హైలెట్‎గా నిలిచాయి. ఇక, ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడిన రాహుల్.. 154 స్ట్రైక్ రేటుతో 238 పరుగులు చేశాడు.