LSG vs DC: మాటల్లేవ్.. ఓన్లీ షేక్ హ్యాండ్: గోయెంకాను పట్టించుకోని రాహుల్

LSG vs DC: మాటల్లేవ్.. ఓన్లీ షేక్ హ్యాండ్: గోయెంకాను పట్టించుకోని రాహుల్

ఐపీఎల్ 2025లో కేఎల్ రాహుల్ లెక్క సరి చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా చేతిలో  ఎదురైన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జయింట్స్ పై జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. రాహుల్ హాఫ్ సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. 160 పరుగుల సాధారణ టార్గెట్ లో మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టి తన మాజీ జట్టుపై రివెంజ్ తీర్చుకున్నాడు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఇదే క్రమంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే గోయెంకా ఏదో మాట్లాడుతుంటే రాహుల్ మాత్రం పట్టించుకోనట్టు వెళ్ళిపోయాడు. నీతో నాకు మాట్లాడు అనవసరం అన్నట్టు ముందుకు సాగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన రాహుల్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రాహుల్ ను అవమానించి వద్దనుకున్నా గోయెంకాకు బుద్ధి చెప్పాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఘోర పరాజయం తర్వాత గోయెంకా బహిరంగాగానే రాహుల్ ను తిట్టాడు. 

Also Read:-పాక్ పేసర్ అత్యుత్సాహం.. తలకేసి బాదడంతో ఉస్మాన్ ఖాన్‌కు తీవ్ర గాయం

ఆ సమయంలో రాహుల్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా అవమానించాడు. నిన్నటి మ్యాచ్ లో గోయెంకా ఏదో మాట్లాడడానికి ప్రయత్నించినా కేఎల్ పట్టించుకోకపోవడం విశేషం. ఈ మ్యాచ్ లో 42 బంతుల్లో రాహుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ తో పాటు అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34) రాణించడంతో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నోపై అలవోక విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది.