ODI World Cup 2023: ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా: కేఎల్ రాహుల్

ODI World Cup 2023: ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా: కేఎల్ రాహుల్

టీమిండియా స్టార్ ఆటగాడు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాడు. గాయం తర్వాత జట్టులోకి రీ  ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక బ్యాటర్ పాక్ పై సెంచరీ చేసి తన పునరాగమాన్ని గ్రాండ్ గా చాటుకున్నాడు. ఇదే ఫామ్ ని వరల్డ్ కప్ లో కూడా కొనసాగిస్తూ నేడు( అక్టోబర్ 29) ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ తన పాత జ్ఞాపకాన్ని మర్చిపోయే పనిలో ఉన్నాడు.
 
వరల్డ్ కప్ లో భారత్ నేడు లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో తలపడబోతుంది. ఈ మైదానం రాహుల్ కు ఒకరకంగా సొంత గడ్డే అని చెప్పాలి. ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన రాహుల్ ఇక్కడ గ్రౌండ్ మీద మంచి అవగాహన ఉంది. అయితే రాహుల్ కు ఇక్కడే ఒక బ్యాడ్ మెమరీ కూడా ఉంది. 2023 ఐపీఎల్ లీగ్ మ్యాచ్  రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పై ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్న రాహుల్.. ఆ తర్వాత 5 నెలలపాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.

Also Read :- గెలిచి పదేళ్లు దాటింది..ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా..?

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో నేడు మ్యాచ్ ఆడుతుండడంతో ఒక విలేఖరీ తన గాయం గురించి ప్రశ్నించాడు. దీనికి రాహుల్ స్పందిస్తూ,..  "నేను ఆ గాయం నుంచి మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు నాకు పదే పదే గుర్తు చేస్తున్నారు" అని లక్నోలో ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో KL రాహుల్ ఒక చిరునవ్వుతో చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ తన గాయాన్ని మర్చిపోయే ఇన్నింగ్స్ ఏమైనా ఆడతాడేమో చూడాలి.