పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. వాకా(WACA)లో ప్రాక్టీస్ (మ్యాచ్ సిమ్యులేషన్) సందర్భంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. ప్రసిధ్ కృష్ణ వేసిన బాల్ అతని మోచేతికి బలంగా తాకింది. ఫిజియోతో చర్చించిన తర్వాత గ్రౌండ్‌ను వీడిన అతను స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో 22 నుంచి మొదలయ్యే తొలి టెస్ట్‌లో అతను ఆడతాడా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
రాహుల్ పరిస్థితిని అంచనా వేయడానికి కాస్త టైమ్ పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక విరాట్ కోహ్లీ కూడా స్కానింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అతనికి అయిన గాయమేంటో ఇంతవరకు స్పష్టత రాలేదు. అయినప్పటికీ ప్రాక్టీస్‌కు వచ్చిన కోహ్లీ 15 రన్స్ చేసి ఔటయ్యాడు.
KL Rahul retired hurt on 29* after being struck by a rising delivery during India’s match simulation at the WACA. He had been in good touch, opening the innings with jaiswal
— 𝙎𝙤𝙣𝙪 ✨ (@KLfied_) November 15, 2024
Hopefully it's not too serious and he will be back on the field Soon 🙏🏻#KLRahul pic.twitter.com/ZE8DCBZpy4