క్రికెట్ లో వినోదమంటే ఫోర్లు, సిక్సులే కాదు అప్పుడప్పుడు కాస్త హాస్యం కూడా నిండి ఉంటుంది. సహచర ఆటగాళ్లతో కంటే ప్రత్యర్థి ఆటగాళ్లపై వేసే జోక్స్ బాగా హైలైట అవుతాయి. దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మూడో వన్డేలో రాహుల్ తన హ్యూమర్ తో దక్షిణాఫ్రికా ఆటగాడిని ఆటపట్టించాడు. సాధారణంగా ఎంతో కూల్ గా, సైలెంట్ గా కనిపించే రాహుల్.. తనలోని కొత్త యాంగిల్ ను చూపెట్టాడు.
177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తన ఆరో వికెట్ ను కోల్పోయింది. అప్పటికే దాదాపుగా మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీలోని ‘రామ్ సీతా రామ్’ పాటను ప్లే చేశాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రాహుల్.. కేశవ్ భాయ్.. నువ్వు ఈ సిరీస్ లో ప్రతిసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడల్లా ఇదే పాటను పెడుతున్నారు’ అని అన్నాడు. దీంతో ఇటు మహారాజ్, అటు రాహుల్ ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.
భారత క్రికెటర్ లా కనిపించే మహారాజ్ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాడట. అందుకే ఈ పాటను పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ కామెడీ టైమింగ్ బాగుందని అందరూ అభినందిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా 78 రన్స్ తేడాతో ప్రొటీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. సంజూ శాంసన్ (114 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108), తిలక్ వర్మ (77 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), రింకూ సింగ్ (27 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
“Keshav Bhai ..Everytime they play this song (Ram Siya Ram) when you come to crease” - KL Rahul pic.twitter.com/iriL7NzEv3
— Yo Yo Funny Singh (@moronhumor) December 21, 2023