ఇంగ్లాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో ఉంది. రెండో రోజు టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. 3 వికెట్లకు 222 పరుగుల వద్ద లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన భారత్..మరో 82 పరుగులను అదనంగా జోడించింది. ప్రస్తుతం భారత్ 63 పరుగులు ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో జడేజా (45) వికెట్ కీపర్ భరత్ (9) ఉన్నారు.
లంచ్ తర్వాత అయ్యర్ వికెట్ ను భారత్ త్వరగానే కోల్పోయింది. 35 పరుగులు చేసిన అయ్యర్ రెహన్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో రాహుల్, అయ్యర్ 64 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ దశలో జడేజాతో జత కలిసిన రాహుల్ భారత్ కు ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. ఐదో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత క్రీజ్ లో కుదురుకున్న రాహుల్ 85 పరుగుల చేసి స్పిన్నర్ హార్ట్లీ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన తెలుగు కుర్రాడు భరత్, జడేజా మరో వికెట్ పడకుండా సెషన్ ను ముగించారు.
India vs England, 1st Test#INDvENG #TeamIndia @IDFCFIRSTBank
— Crickskills (@priyansh1604) January 26, 2024
?DAY 2 TEA?
ENGLAND ???????:-2️⃣4️⃣6️⃣
INDIA ??:-3️⃣0️⃣9️⃣/5️⃣ (76 overs)
Ravindra Jadeja-45*(68)
Shikar Bharat-9*(37)
INDIA LEAD BY 6️⃣3️⃣ RUNS pic.twitter.com/3DFcL56Uav