టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కర్ణాటకలోని తుమకూరులో కనువిందు చేశాడు. తల్లిదండ్రులతో కలిసి తుమకూరులోని శ్రీ సిద్ధగంగ మఠాన్ని సందర్శించిన రాహుల్.. దర్శనం, మతపరమైన ఆచారాలలో పాల్గొన్నాడు. అతన్ని గుర్తుపట్టిన అభిమానులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. రాహుల్ తన కారు వద్దకు వెళుతుండగా.. ఫ్యాన్స్ అతన్ని చుట్టుముట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాలుగో టెస్టుకు సిద్ధం
మోకాలి నొప్పి కారణంగా రెండు, మూడవ టెస్టులకు దూరమైన రాహుల్.. నాలుగో టెస్టుకు ఎంట్రీ ఇవ్వనున్నాడు. నిజానికి అతడు మూడో టెస్టులో ఆడతాడనుకున్న చివరి నిమిషంలో వైదొలిగాడు. దీంతో అతని స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను ఎంపికచేశారు. ప్రస్తుతం రాహుల్ వంద శాతం ఫిట్‌గా ఉండడంతో అతని ఎంట్రీ దాదాపు ఖాయం.
Eeroju Tumkur lo @klrahul annani chala daggarundi chusa pic.twitter.com/tbDgbtUIsu
— 🚶 (@Akhilrc18_) February 18, 2024
2-1 ఆధిక్యం
ఉప్పల్ (హైదరాబాద్) టెస్టులో ఓటమిపాలైనప్పటికీ.. విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టుల్లో టీమిండియా విజయం సాధించి 2-1 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన రెండింటిలోనూ అదే ఫలితం పునరావృతం చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో అగ్రస్థానంలో నిలవచ్చు. ఫిబ్రవరి 23 నుండి రాంచీ వేదికగా భారత్- ఇంగ్లాండ్ నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.