టీమిండియా క్రికెట్ లో బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, విరాట్ కోహ్లీ ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తి. బ్యాటింగ్ లో దాదాపు అన్ని రికార్డ్స్ వీరి ఖాతాలోనే ఉన్నాయి. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వీరి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. వీరి తర్వాత కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్,గంగూలీ, సెహ్వాగ్, అనీల్ కుంబ్లే, రోహిత్ శర్మను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లోకి అడుగుపెడతారు. కానీ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చాడు.
జీవితంలో తనకు తండ్రి ఆదర్శమని.. క్రికెట్ ఫీల్డ్ లో మాత్రం ఏబీ డివిలియర్స్ తనను ఎంతగానో స్ఫూర్తి అని రాహుల్ అన్నారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున 2013, 2015లో రాహుల్ డివిలియర్స్ తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నపుడు తన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ కర్ణాటక బ్యాటర్ స్టార్ స్పోర్ట్స్‌తో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. డివిలియర్స్ తో పాటు కోహ్లీ, గేల్ అదే సమయంలో ఆర్సీబీ తరపున ఆడారు.
ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఆడిన రాహుల్.. ఆ తర్వాత తొడకండరాలు పట్టేడయడంతో ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గత రెండు వారాలుగా అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందాడు. నాలుగో టెస్ట్ సమయానికి కోలుకున్నట్లుగా కనిపించినా.. గాయం తిరగ బెట్టడంతో అతన్ని బీసీసీఐ లండన్ పంపించినట్టు నివేదికలు చెబుతున్నాయి. లండన్ లో రాహుల్ వైద్య నిపుణుల వద్ద చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం కనిపిస్తుంది. లక్నో సూపర్ జయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్..ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో మార్చి 24న తొలి మ్యాచ్ ఆడనుంది.