వరల్డ్ కప్ లో భారత్ బంగ్లాదేశ్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీతో స్టేడియం మారుమ్రోగిపోయింది. అయితే కొన్ని చోట్ల నుంచి కోహ్లీపై విమర్శలు కూడా వచ్చాయి. కోహ్లీ నెట్ రన్ రేట్ గురించి ఆలోచించకుండా సెంచరీ కోసం బంతులు వృధా చేసాడని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కోహ్లీ సెంచరీ కోసం ఆడలేదని రాహుల్ వివరించాడు.
ఈ మ్యాచులో ఒక దశలో కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే కొట్టాల్సిన పరుగులు 26 ఉండడం కోహ్లీ కూడా 74 పరుగుల వ్యక్తి గత స్కోర్ దగ్గర ఉండడంతో కోహ్లీ సెంచరీ గురించి ఎవరూ ఆలోచించలేదు. 74 పరుగుల తర్వాత టీమిండియా విజయానికి కావాల్సిన ప్రతీ పరుగును విరాటే చేశాడు. ఆ 26 పరుగులను కోహ్లీని పూర్తి చేసి అటు జట్టుకు విజయాన్ని ఇటు శతకాన్ని సాధించాడు.ఈ క్రమంలో కొన్నిసార్లు సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా కోహ్లీ తిరగలేదు.
Also Read : Crickek World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ .. కెప్టెన్ లేకుండానే దక్షిణాఫ్రికా
ఈ విషయంపై రాహల్ స్పందించాడు. విరాట్ కోహ్లి సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తే తానే వద్దని చెప్పానని కె.ఎల్ రాహుల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. కానీ సింగిల్స్ తీయకుంటే బాగుండదని... వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని కోహ్లీ తనతో చెప్పాడని రాహుల్ వెల్లడించాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదని కోహ్లీకి తెలిపానని. సెంచరీ పూర్తిచేయమని చెప్పానని రాహుల్ పేర్కొన్నాడు. మొత్తానికి కోహ్లీ తన సెంచరీ కోసమే ఆడలేదని రాహుల్ విమర్శకులకు చెక్ పెట్టాడు.