టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే నచ్చని వారు ఉండరేమో. క్రికెట్ పై ఎన్నో ఏళ్ళు తనదైన ముద్ర వేసిన మాహీ.. చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. క్రికెట్ లవర్స్ సంగతి పక్కన పెడితే ప్రపంచ క్రికెటర్లందరూ ధోనీపై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ.. తమ గౌరవాన్ని చాటుకుంటారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో లక్నో ఓపెనర్ల ధాటికి చెన్నైపై గెలిచి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో రాహుల్ తన మంచితనాన్ని చాటుకున్నాడు. తన తలపై ఉన్న క్యాప్ తీసి ధోనీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరి మనసులను గెలుచుకుంది. సాధారణంగా యంగ్ క్రికెటర్లు ఇలా చేస్తూ ఉంటారు. కానీ సీనియర్ ప్లేయర్ అయినా.. రాహుల్ ఎలాంటి ఈగో లేకుండా ధోనీని గౌరవించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
మ్యాచ్‌లో మొదట చెన్నై 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (40 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. ఓపెనింగ్‌లో అజింక్యా రహానె (24 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మెరవగా.. చివర్లో మొయిన్ అలీ (20 బాల్స్‌లో 3 సిక్సర్లతో 30), ఎంఎస్ ధోనీ (9 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 నాటౌట్) రాణించారు. ఛేజింగ్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (53 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 ), క్వింటన్ డికాక్ ( 43 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ 8 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.
Nicholas Pooran with the winning runs as #LSG register their 4️⃣th win of the season 🙌
— IndianPremierLeague (@IPL) April 19, 2024
They get past #CSK by 8 wickets with a comprehensive performance in Lucknow!
Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvCSK pic.twitter.com/rxsCoKaDaR