Asia Cup 2023: ఈ సారి తప్పించుకోలేవు.. యువ బౌలర్‌కు రాహుల్ వార్నింగ్

Asia Cup 2023: ఈ సారి తప్పించుకోలేవు.. యువ బౌలర్‌కు రాహుల్ వార్నింగ్

ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 20 ఏళ్ళ లంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే సంచలన బౌలింగ్ తో చుక్కలు చూపించిన  విషయం తెలిసిందే. భారత్ తో ఆడుతున్న తొలి మ్యాచులోనే స్టార్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్ వికెట్లు సంపాదించాడు. అనంతరం బ్యాటింగ్ లో 42 పరుగులు చేసి భారత విజయాన్ని ఆలస్యం చేసాడు. 

ఒకానొక దశలో వెల్లలాగే బౌలింగ్, బ్యాటింగ్ చూసి టీమిండియా ఓడిపోతుందా అనే టెన్షన్ ఎదరైంది. అయితే ఈ సారి ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని రాహుల్ చెప్పకొచ్చాడు. ఈ మిస్టరీ బౌలర్ గురుంచి స్పందించిన రాహుల్.." వెల్లలాగే చక్కగా బౌలింగ్ చేసాడు. జట్టు బాధ్యతలను చాలా సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. ఈ మ్యాచులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ రోజు అతనిది. ఈ సారి అతన్ని ఎదర్కొనేటప్పుడు మా వ్యూహం మార్చుకుంటాం. ముందు ముందు అతని బౌలింగ్ లో ఆడాల్సి వస్తే ఎదురు దాడికి దిగుతాం. ఆ రోజు చాలా తొందరగానే వస్తుందని ఆశిస్తున్నా".అని ఈ కుర్ర బౌలర్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక గురువారం పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే భారత్ తో ఆదివారం ఆసియా కప్ ఫైనల్లో ఆడాల్సి ఉంటుంది.