క్రికెట్ లో వైడ్ బాల్ కు రివ్యూ తీసుకునే రూల్ ఈ మధ్యనే వచ్చింది. అప్పటివరకు ఔట్ విషయంలో మాత్రమే రివ్యూలుండేవి. కానీ టీ 20 క్రికెట్ లో వైడ్ విషయంలో అంపైర్ల నిర్ణయాల పట్ల ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ రూల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్లు ఈ రూల్ ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైడ్ బాల్ కు రివ్యూ తీసుకొగా.. అతనికి ఊహించని షాక్ తగిలింది.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఇన్నింగ్స్ 18 ఓవర్ చివరి బంతికి యష్ ఠాకూర్ వైడ్ బాల్ గా విసిరాడు. అయితే ఈ బంతికి రాహుల్ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ చెక్ చేసి ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. దీంతో లక్నో ఏదో చేయాలనుకుంటే ఇంకేదో జరిగింది. ఫ్రీ హిట్ కావడంతో ఈ బంతిని శాంసన్ సిక్సర్ గా మలిచాడు. దీంతో రాహుల్ పై నెటిజన్స్ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ 52 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్ష్య ఛేదనలో లక్నో మొదటి 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. లక్నో గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 118 పరుగులు చేయాలి.
KL Rahul reviews for the wide.
— Abhi (@abhivortex) March 24, 2024
Turns out it was a No-Ball.. pic.twitter.com/HvO6647Afc