ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్‌సీబీకి టైటిల్ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 2016 లో ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. ఈ ఓటమి ప్రతి ఆర్సీబీ అభిమానిని బాధిస్తుంది.
కోహ్లీ, గేల్ తొలి వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినా..మిగిలిన వారు విఫలం కావడంతో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ పరిస్థితి అత్యంత పేలవంగా ఉంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. అద్భుతంగా ఆడుతూ క్వాలిఫయర్ కు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ ను టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గుర్తు చేసుకున్నాడు.
“2016 ఐపీఎల్ ఫైనల్ గురించి విరాట్ కోహ్లీ, నేను చాలాసార్లు చర్చించుకుని బాధపడ్డాం. మాలో ఒకరు కొంచెం ఎక్కువసేపు మ్యాచ్ ఆది ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. ట్రోఫీ గెలిచి ఉంటే ఈ జర్నీ ఒక అద్భుత కథగా ఉండేది. లీగ్ దశలో వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచి.. క్వాలిఫై అవ్వడంతో పాటు ఫైనల్ కు చేరుకున్నాం. సొంత గడ్డపై ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఉంటే ఇంతకన్నా మంచి ముగింపు ఉండేది కాదు". అని రాహుల్ అన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో రాహుల్ కేవలం 11 పరుగులే చేసి ఔటయ్యాడు.
ఇదిలా ఉంటే మెగా ఆక్షన్ లో మరోసారి రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వచ్చే అవకాశం ఉంది. మెగా ఆక్షన్ లో రూ. 83 కోట్ల రూపాయలతో బరిలోకి దిగుతుంది. దీంతో రాహుల్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
'If only'
— ESPNcricinfo (@ESPNcricinfo) November 12, 2024
KL Rahul on that 2016 final with RCB 👉 exclusive on @StarSportsIndia pic.twitter.com/m66kZFKkak