బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు బిగ్ షాక్ అవకాశం కనిపిస్తుంది. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు రోజులు ముందు సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో రాహుల్ కుడి చేతికి గాయమైనట్టు తెలుస్తుంది. రాహుల్ గాయంపై ఇంకా బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళగాయం తీవ్రత ఎక్కువైతే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఈ సిరీస్ లో రాహుల్ ఒక్కడే భారత్ తరపున నిలకడగా ఆడుతున్నాడు.
3 టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్ ల్లో 47 యావరేజ్ తో 294 పరుగులు చేశాడు. భారత్ తరపున ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. డిసెంబర్ (డిసెంబర్ 26) నుంచి మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలే బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ 84 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ 77 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 26న మొదలయ్యే ఈ మ్యాచ్‌కు సంబంధించిన తొలి రోజు టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ‘పబ్లిక్‌కు అందుబాటులో ఉన్న తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ నెల 24న మరికొన్ని టికెట్లను అమ్మకానికి పెడతాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
Also Read :- భువనేశ్వర్‌కు షాక్.. కెప్టెన్‌గా రింకూ సింగ్
ఈ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వనున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం లక్ష. మ్యాచ్‌కు 15 రోజుల టైమ్ ఉన్నా అప్పుడే ఫస్ట్ డే టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఇండో–ఆసీస్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ను చూపెడుతోంది. ఇక పింక్ బాల్ టెస్టుకు మూడు రోజుల్లో 1,35,012 మంది హాజరయ్యారు. ఓవరాల్‌గా 2014–15లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య (1,13,009 మంది) పోలిస్తే ఇది కొత్త రికార్డు. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా 1-1 తో సమంగా నిలిచాయి.
KL Rahul has tremendous record at MCG, but he has suffered a hand injury during today’s practice session. Let’s hope he is fit before the match-day!#AUSvIND #MCG #INDvsAUS #BGT2024 pic.twitter.com/q1gJCyDLr9
— Sports Entertainment (@sportsEnt15) December 21, 2024