DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్

DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రవి బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడో బంతిని షై హోప్ (38) కవర్స్ మీదుగా ఆడగా.. బంతి వేగంగా దూసుకెళ్లి కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చేతిలో పడింది. అయితే, మొదటి ప్రయత్నంలో లక్నో కెప్టెన్ క్యాచ్ అందుకోలేకపోయాడు. వెంటనే ముందుకు డైవ్ చేసి రెండో ప్రయత్నంలో అందుకున్నాడు. దీంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ అందుకోగానే.. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా లేచి చప్పట్లు కొట్టారు.

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం లక్నో యజమాని.. రాహుల్‌ను బహిరంగంగా అవమానించిన విషయం తెలిసిందే.  166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ బ్యాటర్లు 9.4 ఓవర్లలోనే చేధించడాన్ని ఆయన ఆతట్టుకోలేకపోయారు. మ్యాచ్ ముగియగానే మైదానంలోనే రాహుల్‌పై సంజీవ్ విరుచుకుపడ్డారు. అతని నిర్ణయాలను తప్పుబడుతూ ఆవేశంగా మాట్లాడారు. ఆ సమయంలో రాహుల్ కళ్ల వెంట నీరు రాకపోయినా.. అతని బాధ మాత్రం అందరికీ అర్థమైంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంగా మారింది. లక్నో యజమానిపై భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఆటగాళ్లకు సరైన గౌరవం ఇవ్వాలని, ఏదైనా చర్చించాలనుకుంటే నాలుగు గోడల మధ్య చేయాలని సూచించారు.