IND vs ENG: ఉప్పల్‍లో రాహుల్ అరుదైన ఘనత.. భారత ఆరవ క్రికెటర్‌గా

IND vs ENG: ఉప్పల్‍లో రాహుల్ అరుదైన ఘనత.. భారత ఆరవ క్రికెటర్‌గా

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత జట్టులో ఎంత కీలక ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా ఖచ్చితంగా తుది జట్టులో ఉంటూ గత ఐదేళ్లుగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ అరుదైన జాబితాలోకి చేరిపోయాడు. ఈ మ్యాచ్ తో 50 టెస్టులు పూర్తి చేసుకొని స్టార్ క్రికెటర్ల సరసన చేరిపోయాడు.   

వన్డే,టీ20 ఫార్మాట్ లో 50 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న రాహుల్ తాజాగా టెస్టుల్లో 50 టెస్టుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మూడు ఫార్మాట్ లలో 50 మ్యాచులాడిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటికే ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ ఉన్నారు. ఇప్పటివరకు రాహుల్ 50 టెస్టులు, 75 వన్డేలు, 72 టీ20 మ్యాచ్ లు ఆడాడు.    

ధోనీ 90 టెస్టులు,350 వన్డేలు, 98 టీ20లు ఆడగా.. విరాట్ కోహ్లీ 113 టెస్టులు, 292 వన్డేలు,117 టీ20లతో మూడు ఫార్మాట్ లలో 100 కు పైగా మ్యాచ్ లాడాడు. ఇక భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ 96 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు.. రవీంద్ర జడేజా 69 టెస్టులు,197 వన్డేలు,66 టీ20 మ్యాచ్ లాడారు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ 55 టెస్టులు, 262 వన్డేలు, 151 టీ20లు ఆడాడు.