
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. సన్ రైజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్ కు రాహుల్ తుది జట్టులో చేరనున్నాడు. ఈ మ్యాచ్ ఆదివారం (మార్చి 30) వైజాగ్ వేదికగా జరగనుంది. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన తొలి మ్యాచ్ రాహుల్ ఆడని సంగతి తెలిసిందే. ఢిల్లీ తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడే కేఎల్ తండ్రయ్యాడు.
అతని భార్య అతియా శెట్టి సోమవారం (మార్చి 24) ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ కారణంగా ఈ వికెట్ బ్యాటర్ తొలి మ్యాచ్ కు అందుబాటులో లేడు. రాహుల్ రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఈ వెటరన్ బ్యాటర్ లేకపోయినా తొలి మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రాహుల్ ను రూ. 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మీద ఢిల్లీ ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Good news for DC fans!🤩
— CricketGully (@thecricketgully) March 26, 2025
[Gaurav Gupta/TOI] pic.twitter.com/2bbhi1crnR
చెన్నైతో మ్యాచ్ కు భువీ దూరం:
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న టోర్నీ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కు చోటు దక్కలేదు. అతనికి చిన్న గాయం బాధిస్తున్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోయే మ్యాచ్ కు సైతం భువీ అందుబాటులో ఉండడం లేదు. ఈ మ్యాచ్ శుక్రవారం (మార్చి 28) చెన్నై వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో భువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
🚨NEWS 🚨
— CricFreak69 (@Twi_Swastideep) March 26, 2025
- Bhuvneshwar Kumar likely to miss the match against Chennai super kings as he is not fully fit. #CSKvsRCB pic.twitter.com/7GU0DaA8NF