ఫ్యూచర్.. బిజినెస్ మేనేజ్​మెంట్ కోర్సులదే.. బీబీఏ, ఎంబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్

ఫ్యూచర్.. బిజినెస్ మేనేజ్​మెంట్ కోర్సులదే.. బీబీఏ, ఎంబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్
  •  వంద శాతం ప్లేస్​మెంట్స్ సాధించేలా విద్యా బోధన
  • 70 శాతం ప్రాక్టికల్స్, 30 శాతం థియరీతో క్లాసులు 
  • లోకల్ బిజినెస్ నీడ్స్ కు అనుగుణంగా వర్సిటీ కరిక్యూలమ్​
  •  ఒక సెమిస్టర్ ​విదేశంలో పూర్తిచేసేలా ఫారిన్​ ఎక్స్​​చేంజ్ ప్రోగ్రాం
  • విదేశాల్లోని ఓల్డ్​ స్టూడెంట్లు, ఇండస్ట్రియలిస్టులతో గెస్ట్​ లెక్చర్లు   
  • భవిష్య గ్రాడ్యుయేట్స్ కెరీర్​ గైడెన్స్​ ప్రోగ్రామ్ లో కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శరత్ సింహ

హైదరాబాద్ సిటీ, వెలుగు:భవిష్యత్​ బిజినెస్ మేనేజ్​మెంట్ కోర్సులదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ​శరత్ సింహ చెప్పారు. బీబీఏ, ఎంబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ ఉందని, బిజినెస్ మేనేజ్​మెంట్ వైపు వచ్చే స్టూడెంట్ల సంఖ్య ఏటా పెరుగుతోందన్నారు. కొండాపూర్​లోని కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్​ బిజినెస్ స్కూల్  అత్యుత్తమ బిజినెస్ మేనేజ్​మెంట్ విద్యను అందిస్తోందని తెలిపారు. బుధవారం లక్డీకాపూల్​లోని రెడ్ హిల్స్ షా ఫంక్షన్​హాల్​లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, వీ6, వెలుగు న్యూస్​ ఆధ్వర్యంలో ‘భవిష్య’ పేరుతో గ్రాడ్యుయేట్లకు కెరీర్ అవేర్​నెస్ ​ప్రోగ్రామ్​ నిర్వహించారు.

కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొల్లి శ్రీనివాస్​తోపాటు సిటీలో ఐదు క్యాంపస్​లకు చెందిన తపస్య కాలేజీ స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, వీ6, వెలుగు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శరత్ సింహ మాట్లాడుతూ.. కేఎల్ యూనివర్సిటీకి బిజినెస్ మేనేజ్​మెంట్ లో 43 ఏండ్ల అనుభవం ఉందన్నారు. కొండాపూర్​లోని కేఎల్​యూ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రత్యేకంగా బిజినెస్ మేనేజ్​మెంట్ కోసమేనన్నారు. ఇందులో బీబీఏ, ఎంబీఏ, బీసీఏ కోర్సులు ఆఫర్​చేస్తున్నట్లు తెలిపారు. కేఎల్ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు పొందొచ్చని, మెరిట్ సాధించిన స్టూడెంట్లకు స్కాలర్​షిప్ ​అందిస్తామని వెల్లడించారు.

పారిశ్రామిక వేత్తలుగా, కార్పొరేట్​ మేనేజర్లుగా మారాలన్నా.. కొత్త బిజినెస్ లు ప్రారంభించాలన్నా.. బీబీఏ, ఎంబీఏ, బీసీఏ కోర్సులు ఉపయోగపడతాయని తెలిపారు. చదువు పూర్తికాగానే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రతి స్టూడెంట్ ఒక ఎంటర్​ప్రెన్యూర్​గా మారాలని, ఉద్యోగాల చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉందని, టెక్నో స్టార్టప్స్​ను ప్రారంభించొచ్చని వివరించారు. మరో ప్రొఫెసర్ కొల్లి శ్రీనివాస్ బిజినెస్​ మేనేజ్​మెంట్ కోర్సులతో దేశ, విదేశాల్లో లభించే ఉద్యోగావకాశాలను వివరించారు.

కేఎల్​యూకు న్యాక్​ ఏ ++ గుర్తింపు

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్​వర్క్​లో ఆల్ ఇండియా లెవల్​లో కేఎల్ యూనివర్సిటీ 22వ ర్యాంక్ సొంతం చేసుకుందని ప్రొఫెసర్ శరత్ సింహ తెలిపారు. న్యాక్ ఏ++ గుర్తింపు పొందినది చెప్పారు. కొండాపూర్ ​గ్లోబల్ బిజినెస్​ స్కూల్​లో డాక్టరేట్స్, ఐఏఎం, ఐఎస్​బీ ఫ్యాకల్టీలతో కూడిన కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్క స్టూడెంట్​కు క్యాంపస్​రిక్రూట్మెంట్ ట్రైనింగ్​ఇస్తామని, టెక్నికల్, సోషల్, కమ్యూనికేషన్​ స్కిల్స్ నేర్పిస్తామని చెప్పారు.

ఇవి క్యాంపస్ ​ప్లేస్​మెంట్స్​లో ఎంపిక కావడానికి దోహదపడతాయన్నారు. కంపెనీల రిక్వైర్​మెంట్ ​తెలుసుకుని ఆ దిశగా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ ​మేనేజ్​మెంట్ స్టూడెంట్లకు వంద శాతం ప్లేస్​మెంట్స్ ఉంటాయని శరత్ సింహ చెప్పారు. ప్రతి ఏడాది ఫ్లిప్ కార్ట్, గూగుల్, అమెజాన్, టీసీఎస్, బర్కాడియా,  ఐసీఐసీఐ వంటి సంస్థల్లో అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 

ప్రాక్టికల్స్​కు ప్రయారిటీ ఎక్కువ

మిగతా యూనివర్సిటీల కంటే కేఎల్​యూ గ్లోబల్ బిజినెస్ స్కూల్​లో భిన్నంగా విద్య అందిస్తామని  ప్రొఫెసర్​ శరత్ సింహ తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు 70:30 మోడల్ ఫాలో అవుతున్నామని చెప్పారు. 70 శాతం ప్రాక్టికల్​గా, 30 శాతం థియరీలో విద్యను అందిస్తున్నామన్నారు. మార్కెట్ రీసెర్చ్ కేస్ స్టడీలతో క్లాసుల నిర్వహణ జరుగుతోందన్నారు. లోకల్ బిజినెస్ నీడ్స్​కు అనుగుణంగా యూనివర్సిటీ కరిక్యూలమ్​ను డిజైన్ చేస్తున్నామని చెప్పారు.

ఫారిన్​ ఎక్స్​చేంజ్ ప్రోగ్రాం ఉంటుందని, స్టూడెంట్లు ఒక సెమిస్టర్ ఫారిన్​లో పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర దేశాల్లోని సంస్థల్లో పనిచేసే కేఎల్ యూ స్టూడెంట్లు హైదరాబాద్​లోని క్యాంపస్​ను విజిట్ చేసి స్టూడెంట్లకు గైడెన్స్ ఇస్తారని చెప్పారు. ఇండస్ట్రియలిస్టులు గెస్ట్ లెక్చరర్లుగా వచ్చి క్లాసులు చెబుతారని వెల్లడించారు. 

ఫ్యూచర్ కోర్సుల గురించి చక్కగా వివరించారు

డిగ్రీ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, అవకాశాలను ప్రొఫెసర్లు వివరించారు. ఏ కోర్సు చేస్తే ఫ్యూచర్​బాగుంటుంది.. ఎలాంటి ఇనిస్టిట్యూట్​లో చేరాలి అనే విషయాలను వివరంగా చెప్పారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి.  – ప్రేరణ, స్టూడెంట్, తపస్య కాలేజ్

స్టూడెంట్లకు ఎంతో ఉపయోగం

చాలా మంది స్టూడెంట్లకు ఫ్యూచర్ కోసం ఎలాంటి కోర్సు తీసుకోవాలో, ఏ కాలేజీలో చేరాలో క్లారిటీ ఉండదు. అలాంటి వారికి ఈ ప్రోగ్రామ్​ఎంతో ఉపయోగపడుతుంది. కేఎల్​యూ ప్రొఫెసర్లు స్టూడెంట్ల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం సక్సెస్​ కావడానికి సహకరించిన స్టూడెంట్లకు, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తపస్య ఫ్యాకల్టీకి ధన్యవాదాలు.– ఎంఆర్కే గణపతిరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్, వీ6 వెలుగు అడ్వర్టైజ్​మెంట్ ​డిపార్ట్​మెంట్​

ఈ సమయంలో సరైన గైడెన్స్ అవసరం

ఈ సమయంలో స్టూడెంట్లకు సరైన గైడెన్స్ అవసరం. అవకాశాలు చాలా ఉంటున్నాయి. కానీ ఏది ఎంచుకోవాలో స్టూడెంట్లకు  తెలియదు. కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన ఇన్​పుట్స్ స్టూడెంట్లకు ఉపయోగపడుతాయని భావిస్తున్నాం. కేఎల్ యూనివర్సిటీ, వీ6, వెలుగు ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం అభినందనీయం. పిల్లలు వారి ఫ్యూచర్ స్టడీస్​ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. – అహల్య సింగ్, కార్పొరేట్ రిలేషన్స్ హెడ్, తపస్య కాలేజెస్​


కేఎల్​యూ, వీ6, వెలుగుకు థ్యాంక్స్

నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఎంబీఏ ప్రాముఖ్యత, ఎలాంటి కాలేజీల్లో చేస్తే ఫ్యూచర్ బాగుంటుందనేది ప్రొఫెసర్లు వివరించారు. ఈ ప్రోగ్రామ్​తో ఎంబీఏపై నాకు ఒక క్లారిటీ వచ్చింది. కెరీర్​ను ఎంచుకోవడంలో చాలా అనుమానాలు నివృత్తి అయ్యాయి. డిగ్రీ తర్వాత నేను వేయాల్సిన అడుగుల దశలను చక్కగా వివరించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కేఎల్ యూ, వీ6, వెలుగుకు ధన్యవాదాలు.  – శ్రీరాం, స్టూడెంట్, తపస్య కాలేజ్