ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో శుక్రవారం నుంచి ఎవడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మున్నేరు పరివాహక ప్రాంతంలో వాటర్ లెవల్స్ ను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. ప్రమాద హెచ్చరికల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బొక్కల గడ్డ, మోతెనగర్, వెంకటేశ్వర నగర్ ఏరియాలో పర్యటించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మున్నేరు వాటర్ లెవల్ ను ఎప్పటికప్పుడు అధికారులు తనకు తెలియజేయాలని సూచించారు. కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్ ఉన్నారు.