- కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలో కూరగాయల మార్కెట్ ప్రారంభించి వెంటనే అమ్మకాలు జరిపేలా చూడాలని కేఎంసీ కమిషన్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని రోటరీనగర్ లో నిరుపయోగంగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ప్రాంగణం ఎదుట వెజిటేబుల్స్ అమ్ముతున్న వారితో మాట్లాడి ప్రాంగణం లోపల కాయకూరలు అమ్మాలని సూచించారు.
ప్రాంగణాన్ని శానిటేషన్ వర్కర్లతో శుభ్రం చేయించారు. ఖమ్మం ఐడీవోసీ ప్రాంగణంలో కుక్క ముఖానికి ప్లాస్టిక్ బాటిల్ ఇరుక్కొని ఇబ్బంది పడుతోందని ఫిర్యాదు రాగా వెంటనే కేఎంసీ అధికారులు స్పందించి జాగ్రత్తగా ప్లాస్టిక్ బాటిల్ ను తొలగించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ షఫీ ఉల్లా ఉన్నారు.