ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలోని కవిరాజ్ నగర్ ఏరియాలో ఉన్న వాగుగుండా ప్రవహించే నీరు లకారం చెరువులోకి వెళ్లకుండా అడ్డుగా వాగులోనే నిర్మించిన ఐస్ ఫ్యాక్టరీని కేఎంసీ ఆఫీసర్లు మంగళవారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో చేపట్టిన అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ వసుంధర పర్యవేక్షణలో ఫ్యాక్టరీని నేలమట్టం చేశారు. ఇంకా వాగును ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్ లపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆక్రమించుకున్న భూమి స్వాధీనం
గుండాల, వెలుగు : మండల కేంద్రంలోని గణేశ్నిమజ్జనం చేసే స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. గ్రామస్తులు కంప్లైంట్ తో తహసీల్దార్ ఇమ్మానియేల్ మంగళవారం సర్వేర్, ఇరిగేషన్ ఏఈ గణేశ్‌తో కలిసి రెవెన్యూ, పోలీస్ శాఖ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.