సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పట్టుకున్న కేఎంసీ అధికారులు

సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పట్టుకున్న కేఎంసీ అధికారులు

ఖమ్మం టౌన్,వెలుగు :  ఖమ్మం నగరంలోని 39వ డివిజన్ శివాలయం బజార్ లో  కిశోర్ షాప్ లో సోమవారం    రైడింగ్ చేశారు. ఈ తనిఖీలో 50 కిలోలు  120 ప్లస్ మైక్రాన్స్ లోపు ఉన్న  సింగిల్ యూస్ ప్లాస్టిక్ దొరికింది.  ఓనర్ కు 10 వేలు పెనాల్టీ విధించారు.

   ప్లాస్టిక్​  అమ్మితే  చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తనిఖీలో సూపర్ వైజర్ సాంబయ్య, సానిటరీ ఇన్​స్పెక్టర్​ మల్లయ్య, బంగారి, ఫణి కుమార్, దుర్గాప్రసాద్,  రమేశ్, రాంబాబు, జవాన్లు, డీఆర్ ఎఫ్ టీం పాల్గొన్నారు.