
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని గట్టయ్య సెంటర్ ఉన్న కమర్షియల్ షాప్స్, హోటల్స్, కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లలో శనివారం కేఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 34 కేజీల ప్లాస్టిక్ ను పట్టుకుని సీజ్ చేశారు. ప్లాస్టిక్ కవర్లు అమ్మినవారికి రూ.14 వేలు ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు.