
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ ను సీనియర్లు ర్యాగింగ్ చేసిన మాట నిజమేనని కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‍దాస్ తెలిపారు. కేఎంసీలో ర్యాగింగ్ ఘటనపై కాలేజీ, పోలీస్ అధికారులు, పేరెంట్స్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కూడిన 15 మంది సభ్యుల యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం సమావేశమైంది.
కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే మొదటిసారి అని మోహన్‍దాస్ మీడియాకు తెలిపారు. ర్యాగింగ్ చేసిన ఏడుగురు స్టూడెంట్లపై 3 నెలల పాటు సస్పెన్షన్ విధించామని, ఏడాది పాటు కాలేజీ హాస్టల్లో ఉండడానికి వారికి అనుమతి లేదని చెప్పారు. మరో 20 మంది స్టూడెంట్లకు నోటీసులిచ్చినట్లు తెలిపారు.