ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ గోళ్లపాడు ఛానల్ పై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కేఎంసీ సిబ్బంది గురువారం కూల్చేశారు. అనుమతి లేని నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
25న కేఎంసీ రెవెన్యూ మేళా...
కేఎంసీ పరిధిలోని 60 డివిజన్లలోని నివాస ఇండ్లకు సంబంధించి పంపు, ఇంటి పన్నులు, ఇంటి నంబర్ సవరణ.. పన్నులో హెచ్చు, తగ్గులు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. మేళలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఖమ్మం నగరంలో 60 డివిజన్లలో మూడు రోజులపాటు నిర్వహించిన వార్డు సభలు గురువారంతో ముగిశాయి. స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునేందుకు 5,752 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. అద్దె ఇండ్లలో ఉంటూ ఇండ్ల స్థలం లేదని 31,490 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డ్స్, కోసం, సవరణలకు సంబంధించి 5.295 దరఖాస్తులు వచ్చాయి.