Good Health : రన్నింగ్, జాగింగ్ చేసే వాళ్లకు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. అయితే ఈ ఎక్సర్ సైజు తప్పకుండా చేయాలి.. !

Good Health : రన్నింగ్, జాగింగ్ చేసే వాళ్లకు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. అయితే ఈ ఎక్సర్ సైజు తప్పకుండా చేయాలి.. !

రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు... ఎప్పుడైనా కీళ్ల నొప్పి బాధపెడితే, చాలామంది అది మామూలు విషయమే అనుకుంటారు. కానీ, పదే పదే ఇబ్బంది వస్తే  కచ్చితంగా ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వాకింగ్, జాగింగ్ లు  చేస్తే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు దరిచేరవనే భావన చాలా మందిలో ఉంది. కానీ, అంతకన్నా ముందు తొడ, పిక్క కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేయాలనే విషయాలు చాలామందికి తెలియదు.  

ALSO READ : నీళ్లు ఎక్కువ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న మహిళ.. రోజుకెన్ని నీళ్లు తాగాలి.?

నిజానికి, మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడాలనుకునేవాళ్లు కాళ్లు, పిక్క కండరాలు గట్టిపడే స్క్వాట్,  బ్రిడ్జెస్, హిప్ స్టెబిలిటీవ్యాయామాల్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి. ఇలా కాకుండా డైరెక్టుగా రన్నింగ్, జాగింగ్ చేస్తే, మోకాలు కీలు మరింత దెబ్బ తింటాయి. ఇతర వ్యాయామాలన్నీ చేశాక కూడా రన్నింగ్ లో  నొప్పి అనిపిస్తే, కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవాలి. ఐస్ గడ్డను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న భాగాల్లో ఉంచి అటు, ఇటు తిప్పాలి. నొప్పి తగ్గగానే మళ్లీ వ్యాయామాలు చేయొచ్చు. ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నొప్పి మళ్లీ వస్తే, వెంటనే ఫిట్ నెస్ ట్రైనర్లను, వైద్యులను సంప్రదించాలి.
-వెలుగు, లైఫ్-