కరీంనగర్​లో ట్రాఫిక్..​హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌పై కత్తితో దాడి

  • తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నాడనే కోపంతోనే..

కరీంనగర్ క్రైం, వెలుగు :  కరీంనగర్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌ హెడ్‌‌‌‌కానిస్టేబుల్‌‌‌‌ నెల్లి శ్రీనివాస్‌‌‌‌(50)పై సోమవారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌‌‌‌.. కరీంనగర్ మండలం బొమ్మకల్‌‌‌‌ సిటిజన్‌‌‌‌ కాలనీలో ఉంటూ కరీంనగర్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్​లో హెడ్‌‌‌‌కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి దగ్గరుండే పిట్టల వెంకటేశం రోజూ మందు తాగుతూ భార్యతో గొడవపడేవాడు. తన సమస్య పరిష్కరించమని వెంకటేశం భార్య.. శ్రీనివాస్‌‌‌‌ వద్దకు వచ్చింది.

తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని శ్రీనివాస్‌‌‌‌పై వెంకటేశం కక్ష పెంచుకున్నాడు. సోమవారం శ్రీనివాస్‌‌‌‌ ఇంట్లోకి వెళ్లి కత్తితో దాడి చేశాడు. శ్రీనివాస్‌‌‌‌ తలకు నాలుగు కత్తిగాట్లు కాగా అడ్డువచ్చిన శ్రీనివాస్​కొడుకు శివకృష్ణ, సోదరుడు నెల్లి కొమురయ్యకు  కూడా గాయాలయ్యాయి.  హెడ్‌‌‌‌ కానిస్టేబుల్​కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌‌‌‌ సీఐ ప్రదీప్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు.