హైదరాబాద్‌‌లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌‌లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్​, వెలుగు: కిందటి నెలలో హైదరాబాద్‌‌లో రూ.4,266 కోట్ల విలువైన 7,124 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్  చేసింది. 2023 లోని జులైతో పోలిస్తే  ఇండ్ల రిజిస్ట్రేషన్లు విలువ పరంగా 48 శాతం, సంఖ్యాపరంగా 28 శాతం పెరిగాయని తెలిపింది. 

ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్‌‌లో 46,368 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, ఏడాది ప్రాతిపదికన ఇది 17 శాతం గ్రోత్‌‌కు సమానమని వెల్లడించింది.