తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెల జూన్ లో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తారు.
ALSOREAD:కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి
బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జూలై 17 సోమవారం రోజున సెలవు ఉంటుంది. ఈ రోజున సాధారణ సెలవు కింద కేటాయిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.