పెట్రోల్ బంకుల్లో జరిగే క్రెడిట్ కార్డ్ మోసాలివే.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ డబ్బు సేఫ్..!

పెట్రోల్ బంకుల్లో జరిగే క్రెడిట్ కార్డ్ మోసాలివే.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ డబ్బు సేఫ్..!

Credit Card Safety: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు నగరాల్లో బ్రతుకుతున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి తిరిగే బిజీ షేడ్యూల్ మధ్య వారు కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో చిన్నచిన్న తప్పులు చేస్తున్నారు. ఉద్యోగులు ఈ క్రమంలో నూటికి ఎనభై శాతం క్రెడిట్ కార్డులను రోజువారీ చెల్లింపులకు వినియోగించటం సర్వ సాధారణంగా మారిపోయింది. అలా పెట్రోల్ బంకుల వద్ద కూడా వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే సగం మందికి అక్కడ జరిగే వివిధ రకాల మోసాల గురించి అవగాహన తక్కువగా ఉంటుంది.

వాస్తవానికి పెట్రోల్ బంకుల వద్దే ఎక్కువగా ప్రజలు మోసాలకు గురవుతుంటారు. హడావిడిగా పెట్రోల్ పట్టించుకుని తమ పనులపై వెళ్లేవారినే దోచేందుకు కొందరు పెట్రోల్ బంకుల సిబ్బంది చూస్తుంటారు. ఇలాంటి క్రమంలో మీ కార్డుల భద్రతను మెరుగుపరుచుకోవటానికి, నిర్థారించుకోవటానికి పాటించాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం. 

1. ముందుగా పెట్రోల్ బంకుల్లో చేసే కార్డు పేమెంట్ల సమయంలో కార్డు రీడర్ లేదా స్పైపింగ్ మెషిన్ కి ఏదైనా అటాచ్మెంట్స్ లేదా లూజ్ పార్ట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయేమో తప్పకుండా గమనించాలి. కొందరు ఉద్యోగులు అక్రమంగా కార్డు చెల్లింపు మెషిన్లకు స్కిమ్మింగ్ డివైజ్ అటాట్ చేయటం ద్వారా కార్డుదారుని విలువైన రహస్య సమాచారాన్ని తస్కరిస్తుంటారు. ఏదైనా అనుమానం కలిగినా తప్పిదాలను గుర్తించినా వెంటనే వాటిని రిపోర్ట్ చేయండి.

2. వీలైనంత వరకు పెట్రోల్ బంకుల్లో చెల్లింపులు చేసేందుకు కార్డుదారులు కాంటాక్స్ లెస్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవటం ఉత్తమం. దీని ద్వారా ఎలాంటి స్పైపింగ్ డివైజ్ లో కార్డు ఉంచకుండానే నేరుగా చెల్లింపులను నిర్వహించటానికి వీలు ఉంటుంది. ఇలా చేయటం వల్ల వేగవంతంగా చెల్లింపులను నిర్వహించటంతో పాటు కార్డు భద్రతను నిర్థారించుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెస్ పేమెంట్ కోసం అడగటం మీరు చేయాల్సిన ముఖ్యమైన పని.

3. హడావిడిగా పెట్రోల్ బంకులో చెల్లింపు చేసినప్పటికీ మీరు ఇంటికి వెళ్లిన తర్వాత రోజులో నిర్వహించిన వివిధ కార్డ్ ట్రాన్సాక్షన్లను పరిశీలించటం తప్పనిసరి. ఇలా చేయటం వల్ల మీ ప్రమేయం లేకుండా ఏదైనా డబ్బు చెల్లింపు కార్డు నుంచి జరిగినట్లు గమనిస్తే దానిని గుర్తించి సకాలంలో దానిని రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ గమనించటం మంచిది. అలా భవిష్యత్తులో కూడా అక్రమ లావాదేవీలు జరిగితే వెంటనే గుర్తించటానికి అవకాశం ఉంటుంది. 

4. పెట్రోల్ బంకులో వాహనదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేపట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండటంతో దాదాపు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇలా అప్రమత్తంగా ఉండటం వల్ల అక్కడి సిబ్బంది మోసం చేయటానికి చేసే ప్రయత్నాలను పూర్తిగా నివారించవచ్చు. అలాగే చెల్లింపులకు ఉపయోగించే స్పైపింగ్ మెషిన్ దూరంగా ఉన్నట్లతే వారికి కార్డును ఇవ్వకుండా మీదగ్గరికే మెషిన్ తీసుకురమ్మని కోరండి.

5. ఇక చివరిగా ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉరుకుల పరుగుల సమయంలో కూడా మీ తగ్గరలోని పేరున్న పెట్రోల్ బంకు నుంచే ఇంధన్ ఫిల్ చేసుకోండి. ఇలా చేయటం ద్వారా ఒకవేళ ఏదైనా కార్డు దుర్వినియోగం జరిగినప్పుడు అక్కడి యాజమాన్యం ఏర్పాటు చేసే సీసీ టీవీ కెమెరాలు మీకు సహాయకరంగా నిలుస్తాయి. సిబ్బంది చేసిన మోసాన్ని రుజువు చేయటానికి సదరు ఫుటేజ్ ఆధారంగా నిలుస్తుంది.