Credit Card Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. కొత్త నెలలో మారిన రూల్స్ ఇవే..

Credit Card Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. కొత్త నెలలో మారిన రూల్స్ ఇవే..

New Credit Card Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగానికి చెందిన అనేక కీలక మార్పులు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఏటీఎం విత్ డ్రా పాలసీ మార్పులు, క్రెడిట్ కార్డులకు అందించే బెనిఫిట్స్, బ్యాంక్ ఖాతాలో మినిమం  బ్యాలెన్స్ వంటి అనేక కీలక మార్పులు ఇందులో ఉండనున్నాయి. ఇవి నేరుగా వినియోగదారులను ప్రభావితం చేయనున్నందున ప్రజలు వీటికి సంబంధించిన వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి. 

అయితే ప్రస్తుతం మనం క్రెడిట్ కార్డుల విషయంలో వస్తున్న మార్పులను గమనిద్దాం. ప్రభుత్వ యాజమాన్య సంస్థ స్టేట్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వరకు సంస్థలు తమ క్రెడిట్ కార్డు పాలసీలను మార్చటం వల్ల కార్డు యూజర్లపై ప్రభావం ఎలా ఉంటుందనే వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం..

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు:
కొన్ని లావాదేవీలపై ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ బెనిఫిట్స్ గతంలో కంటే తగ్గిస్తోంది. ముందుగా సింపుల్ క్లిక్ ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు స్విగ్గీలో చేసే చెల్లింపులపై కేవలం 5 రెట్లు మాత్రమే రివార్డ్ పాయింట్లను పొందనున్నారు. ఇది గతంలో ఉన్న 10 రెట్ల రివార్డ్ పాయింట్ల కంటే తక్కువ కావటం గమనార్హం. ఇదే సమయంలో కార్డు హోల్డర్లు మైంత్ర, బుక్ మై షో, అపోలో 24 వంటి ఇతర భాగస్వామి బ్రాండ్ల వద్ద చేసే ట్రాన్సాక్షన్లపై 10 రెట్లు రివార్డు ప్రయోజనాలను పొందటం కొనసాగిస్తారని బ్యాంక్ వెల్లడించింది.

ఎస్‌బీఐ ఎయిర్ ఇండియా కార్డు:
ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రివార్డ్‌ల్లో భారీ కోతలను చూడనున్నారు. ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి కేవలం 5 రివార్డ్ పాయింట్లను అందించనుంది. గతంలో ఇది 15 పాయింట్లుగా ఉండేది. అలాగే ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఖర్చు చేసే ప్రతి రూ.100కి 10 రివార్డ్ పాయింట్లను అందుకోనున్నారు. గతంలో 30 పాయింట్లు రివార్డుగా అందుకునేవారు.

యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్:
ఎయిర్ ఇండియాతో విస్తారా విలీనం తర్వాత యాక్సిస్ బ్యాంక్ దాని విస్తారా క్రెడిట్ కార్డుల ప్రయోజనాలకు అనేక మార్పులు చేస్తోంది. కొత్త మార్పులు ఏప్రిల్ 18, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ తేదీన లేదా ఆ తర్వాత తమ కార్డులను రెన్యూవల్ చేసే కార్డుదారులకు ఇకపై వార్షిక రుసుము వసూలు చేయబడదు. ఇదే క్రమంలో కాంప్లిమెంరీగా అందించిన మహారాజా క్లబ్ టైల్ మెంబర్షిప్ తొలగింపు వంటివి ఉన్నాయి.

ALSO READ : SBI News: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు బంద్, పూర్తి వివరాలు..

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్:
మార్చి 31 నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ దాని క్లబ్ విస్తారా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మైలురాయి రివార్డులను నిలిపివేసింది. అప్పటి వరకు కస్టమర్లు మహారాజా పాయింట్లను సంపాదించడం కొనసాగించవచ్చు. కానీ చివరికి కార్డు దశలవారీగా తొలగించబడుతుందని బ్యాంక్ వెల్లడించింది. ఇకపై క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్షిప్ అందుబాటులో ఉండదు. దీంతో ప్రీమియం ఎకానమీ టికెట్,  క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్‌లతో సహా కాంప్లిమెంటరీ వోచర్‌లు నిలిపివేయబడతాయి. అలాగే మార్చి 31, 2025 తర్వాత తమ కార్డులను పునరుద్ధరించే కస్టమర్‌ల కోసం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఒక సంవత్సరం పాటు వార్షిక రుసుమును మాఫీ చేస్తుంది.