
Middle Class Income: భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి కేటగిరీ ఆదాయ వర్గానికి చెందే ప్రజలు ఉన్నారు. అయితే పేరుకే మధ్యతరగతి అయినప్పటికీ.. ఎంత సంపాదిస్తే ఏ వర్గం కిందకు వస్తారనే విషయం చాలా మందికి తెలియదు. అంటే మధ్యతరగతిలో తక్కువ ఆదాయం నుంచి అధిక ఆదాయం వరకు సంపాదిస్తున్న ప్రజలు ఉన్నారు. వీటిలో మీరు ఏ స్థాయిలో ప్రస్తుతం ఆదాయాన్ని సంపాదిస్తున్నారనే విషయం తెలుసుకోవటంతో వాస్తవ ఆర్థిక స్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలు ఉంటుంది.
వివరాల్లోకి వెళితే మధ్యతరగతి కేటగిరీలో నెలకు రూ.9లక్షల 23వేల 227 సంపాదిస్తున్న వ్యక్తులు కేవలం 1 శాతం మంది మాత్రమే ఉన్నారని వెల్లడైంది. ఇకపోతే నెలకు రూ.3లక్షల 99వేల 231 మాత్రమే సంపాదిస్తున్న వారి సంఖ్య మధ్యతరగతిలో 2 శాతం మాత్రమే. ఇక 5 శాతం మంది మాత్రమే నెలకు లక్ష 99వేల 122 సంపాదిస్తు్న్న వారు ఉన్నారు. ఇక అత్యధికంగా నెలకు రూ.88వేల 109 సంపాదిస్తున్న వారు అక్షరాలా 10 శాతం మంది మాత్రమే ఉన్నారు.
ఇక నెలకు రూ.23వేల 986 మాత్రమే సంపాదిస్తున్న వారు 20 శాతం మంది మధ్యతరగతి ప్రజలు ఉండగా.. అత్యధికంగా 50 శాతం మంది నెలకు రూ.20వేల 052 సంపాదనను కలిగి ఉన్నారు. ఈ లెక్కన మీరు నెలకు కనీసం రూ.30వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే మధ్యతరగతి భారతీయుల మెుత్తంలో 70 శాతం మందికంటే ఎక్కువగా మీ సంపాదన ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కేవలం 30 శాతం మంది మాత్రమే నెలకు రూ.30వేల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం ఇండియాలో ఉన్నారని వెల్లడైంది.
ALSO READ : మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో SWP ఆప్షన్ గురించి తెలుసా..? బోలెడు ప్రయోజనాలు..!
ఇక మధ్యతరగతి కేటగిరీలో తక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. అవును నెలకు రూ.16వేల 059 సంపాదించేవారు టాప్ 60 శాతం మందిలో ఉండగా.. నెలకు రూ.14వేల 500 సంపాదిస్తున్న వారు టాప్ 70 శాతంలో ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో టాప్ 80 శాతం మంది నెలకు రూ.11వేల 856 సంపాదిస్తుండగా.. ఆఖరున ఉన్న టాప్-90 శాతం మంది నెలకు అత్యల్పంగా రూ.4వేల 347 మాత్రమే సంపాదిస్తున్నారని వెల్లడైంది.
మధ్యతరగతి పెంపకం ఇలా..
అయితే మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను ఆరోగ్యంగా పెంచరని శశాంక్ శర్మ అనే వ్యక్తి తన లింక్డిన్ ఖాతాలో పంచుకున్నారు. వారు తమ పిల్లలను మార్కులు, పెళ్లి, మ్యానర్స్, మెంటల్ వెల్నెస్ వంటి అంశాలపై ఫోకస్ చేస్తారన్నారు. నిద్ర, ఆరోగ్యం, ఒత్తిడిని మేనేజ్ చేయటం వంటి అంశాలపై పిల్లలకు పెంపకంలో నేర్పరని ఆయన అన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవటంతో దశాబ్ధాల తర్వాత డిస్క్ సమస్యలు, డయాబెటిస్, అధిక బరువు, నిద్రలేనితనం వంటి అనేక సమస్యలకు ప్రజలు గురవుతున్నారని పేర్కొన్నారు. అనారోగ్యం వచ్చే వరకు శరీరాన్ని పట్టించుకోవటం మానేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.